కేశంపేట : గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో యు వజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిటీ మాజీ సభ్యుడు రాంబల్‌నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌ఖాన్, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, ఆంజనేయులు, ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్, మాజీ ఎంపీపీ విశ్వనాథం, మాజీ జడ్పీటీసీ పల్లె నర్సింగ్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.