ఇబ్రహీంపట్నం, ఆగష్టు 15 : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని రాచకొండ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆర్ఎస్ఐ సంతోష్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకపోవటం వలన కలిగే అనర్థాలపై వివరించారు.
ప్రతి ఒక్కరు మోటర్‌సైకిల్‌పై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించటంతో పాటు కారులో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని వారు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సోమనాథ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.