శరవేగంగా కాలేజీల భవన నిర్మాణం
తాండూరు నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలతో పాటు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు శరవేంగా జరుగుతున్నాయి.
- రూ. 25 కోట్లతో నర్సింగ్ కళాశాల
- రూ. 2 కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాల
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి
తాండూరు, డిసెంబర్ 14: తాండూరు నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలతో పాటు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు శరవేంగా జరుగుతున్నాయి.
దీంతో తాండూరులో విద్యావ్యవస్థలో మంచి మార్పులు రానున్నాయి. నిజాం పాలనలో కట్టించిన తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థల ఉండడంతో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో జూనియర్ కళాశాల భవన నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా ఇంటర్ విద్యార్థులు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు.

దశాబ్దాల నుంచి మౌళిక వసతులు తేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు స్థానిక నేతలు, అధికారుల దృష్టికి సమస్యలను తీసుకు వెళ్లడంతో స్పందించిన అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. టెండరు వేసి వెంటనే పను లు ప్రారంభించారు. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
బషీరాబాద్ మండలంలో కూడ జూనియర్ కళాశాల భవన నిర్మా ణపనులు త్వరగా ప్రారంభించేందుకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ముహూర్తం చేయనున్నారు. నర్సింగ్ కళాశాల పనులు కూడా 30 శాతానికి పైగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేయనున్నట్లు సంబంధిత శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఇటీవల వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల్లో వేగం పెం చాలని సూచించారు. నాణ్యతలో తేడా రాకూడదన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

