అటు సీఎం సొంత ఇలాకా.. ఇటు స్పీకర్ నియోజకవర్గం మధ్యలో తాండూరు నియోజకవర్గం ఉన్నది. ఈ రెండింటి మధ్య ఉన్న తాండూరులోని రోడ్లు నరకప్రాయంగా మారాయి. చిన్నపాటి వానకే బురదమయంగా మారుతుం డడంతో పాదచారులు, వాహనదారు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొన్నది. ద్విచక్ర వాహనం ఆ దారిలో వెళ్తూ పట్టు తప్పితే.. ఆ బురదలో కూరుకుపోవాల్సిందే..వాహనదారులు కింద పడాల్సిందే.
తాండూరు, సెప్టెంబర్ 29 : తాండూరు నియోజకవర్గంలో ప్రధాన రోడ్ల తోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు కూడా అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షం పడితేనే బురదమయంగా మారుతున్నాయి. తాండూరు-వికారాబాద్, తాండూరు-కోట్‌పల్లి, తాండూరు-చించొల్లి, తాండూరు-మహబూబ్‌నగర్ రోడ్లు నిర్మాణంలో ఉన్నా వాటిపై ఏర్పడ్డ గుంతలు ప్రయాణికులకు యమపాశంగా మారాయి. రాత్రివేళ ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తున్నది.
తాండూరు-కరణ్‌కోట్, బెల్కటూర్ రోడ్డు బురదమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు రూ. కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలొచ్చి..ప్రభుత్వం మారడంతో రోడ్డు మరమ్మతుల పనులు అటకెక్కాయి.
ఆ పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు రోడ్లపై దృష్టి సారించి నిలిచిన పనులను వెంటనే ప్రారంభించాలని, రోడ్లు పాడైన గ్రామాలకు వెంటనే ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్పీకర్ ఇలాకాలో ఇలా..
వికారాబాద్ : ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ బురదమయంగా మారాయి. మండలంలోని గోధుమగూడ రైల్వే బ్రిడ్జి కింద ఇటీవల కురిసిన వానలకు వచ్చిన వరదతో మట్టి కొట్టుకొచ్చి అక్కడ పెద్ద ఎత్తున పేరుకుపోయింది. అటుగా వెళ్లే సర్పన్‌పల్లి, గొట్టిముక్కల, ధ్యాచా రం, ఐనాపూర్ తదితర గ్రామా ల వాహనదారులు ఆ బురద నుంచి వెళ్తుండగా.. వారి వెహి కిల్స్ ఇరుక్కుపోతుండడంతో తల లు పట్టుకుంటున్నారు.