హైదరాబాద్, మార్చి 16 : దేశంలో అతిపెద్ద ఈవీ చార్జింగ్ అండ్ క్రిటికల్ పవర్ కంపెనీ ఎక్సికామ్ టెలి-సిస్టమ్స్ లిమిటెడ్.. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది.
ఈవీ చార్జింగ్, క్రిటికల్ పవర్ సొల్యుషన్స్ పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో నగరంలో రూ.216 కోట్లతో 18.4 ఎకరాల స్థలంలో 2.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. తొలి దశలో 750 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్న ఈ యూనిట్ అందుబాటులోకి రావడంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం రెండింతలు పెరగనున్నది.