వికారాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. వారం రోజులపాటు కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామీణ, మున్సిపాలిటీ, జిల్లా కేంద్రం రోడ్లు కూడా గుంతలుగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, వర్షం నీరు నిలిచి బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా వికారాబాద్-మోమిన్పేటకెళ్లే రహదారి, మోమిన్‌పేట-మర్పల్లి రోడ్డు, వికారాబాద్-కోట్‌పల్లి రోడ్డు, బొంరాస్‌పేట మండల కేంద్రం నుంచి గ్రామాలకెళ్లే రోడ్లు, దౌల్తాబాద్ మండలంలోని రోడ్లు, తాండూరు-పెద్దేముల్ వెళ్లే రోడ్లు, మోమిన్‌పేట-శంకర్పల్లి వెళ్లే రోడ్డు, నవాబుపేట మండల కేంద్రంలోని రోడ్లన్నీ పెద్ద, పెద్ద గుంతలతో ద్విచక్ర వాహనదారులను భయపెడుతున్నాయి.
దోమ మండలంలోని అయినాపూర్, పూడూరు మండలంలో చన్గ్గోముల్-మన్నెగూడ రోడ్డు అయితే మరీ అధ్వానంగా తయారైంది. చన్గోముల్-మన్నెగూడ రోడ్డు వెళ్లే దారి మధ్యలో రోడ్డు కుంగిపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగు తుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. నవాబుపేట్ మం డల కేంద్రం సమీపంలో అయితే రోడ్డు మరీ ఘోరంగా తయారైంది. రో డ్డంతా కొట్టుకుపోగా కంకర రాళ్లు పైకి తేలాయి. సమస్యను పరిష్కరించా లని స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించినా ఫలితంలేదని వాహనచోదకులు, ప్రజలు పేర్కొంటున్నారు.
మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ అంతటా రోడ్లు అధ్వానంగా మారాయి. ఆ సెగ్మెంట్ లోని అన్ని మండలాల్లోనూ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. కొన్ని తండాలు, గ్రామాలకెళ్లే రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనదారుల అవస్థలు వర్ణణాతీ తంగా ఉన్నాయి. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు గ్రామాల్లో అంతర్గత రోడ్లు ఎక్కడా చూసిన బురద, గుంతలతో దర్శనమిస్తున్నాయి. గుంతలు పడి అవస్థలు పడుతున్నా పాలకులు మరమ్మతు లు చేయించకపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటినా ఒక్క రూపాయి కూడా రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం గమనార్హం.