పెద్దఅంబర్‌పేట, ఆగస్టు 28: దివ్యాంగులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలిమండ్ల గోవర్ధన్ అన్నారు. బుధవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి 18వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులో వారికి ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
పట్నంలో వీహెచ్పీఎస్ జెండావిష్కరణ
ఇబ్రహీంపట్నం : దివ్యాంగుల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నట్లు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి (వీఎచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. వీహెచ్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఇబ్రహీంపట్నంలో వీహెచ్పీఎస్ జెండాను ఆవిష్కరంచి మాట్లాడారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొండ్రు ప్రవీణ్, కృష్ణ, వీహెచ్పీఎస్ నాయకులు శ్రీనివాస్, యాదయ్య, బాలరాజు, సంజీవ, సురేశ్, లింగమయ్య తదితరులున్నారు.
మాల్లో..
యాచారం : మండలంలోని మాల్ మార్కెట్లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు డేరంగుల ఈశ్వర్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి మహ్మద్ సలీం మాట్లాడుతూ..ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆసరా పింఛన్‌ను రూ.6వేలకు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.
పింఛన్ పెంచేవరకు వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతామన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ నాయకులు పోషయ్య, మాజీ సర్పంచ్ జంగయ్య, నాయకులు శేఖర్‌గౌడ్, గాలయ్య, గుండ్లపల్లి మురళి, శ్రీను, లింగం, తిరుమలేశ్, చందర్, బాలకృష్ణ, నర్సింహాచారి పాల్గొన్నారు.