మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టా గ్రామ రెవెన్యూలో గల గుండ్ల వాగును కబ్జా చేసి అక్రమంగా చేపట్టిన నిర్మానాలను రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు. గుండ్ల వాగు కబ్జాకు గురవుతుందని వరుసగా పత్రికల్లో వచ్చినా కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించి బుధవారం రెవెన్యూ అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా గుండ్ల వాగు చేరుకొని వాగులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను జెసిబిల సహాయంతో తొలగించారు.
వరద కాలువలను ఎవరు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు కబ్జాకోరులపై క్రిమినల్ కేసులు పెడుతామాని తాసిల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరించారు. మొయినాబాద్ మండలంలో ఎక్కడెక్కడ వాగులు కానీ, చెరువులు, కుంటలు కబ్జాలకు పాల్పడి నిర్మాణాలు చేపడితే నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు కబ్జాకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు.