వికారాబాద్, జూలై 13: రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతన్నల పట్ల రేవంత్ అవహేళనగా మాట్లాడటం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు గయాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, పట్టణ ఉపాధ్య క్షుడు అనంత్‌రెడ్డి, కౌన్సిలర్లు గోపాల్, కృష్ణ, నవీన్, కృష్ణారెడ్డి, అనంత్‌రెడ్డి, నాయ కులు విజయ్‌కుమార్, లక్ష్మీకాంత్‌రెడ్డి, సురేశ్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
మర్పల్లి: రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం జడ్పీటీసీ మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మకు ఉరేసి నిరసన తెలిపారు.. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు సోహెల్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నాయబ్‌గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గౌస్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, నాయకులు సంగన్న, షఫీ, సుధాకర్, నర్సింహులు, శంకర్, అశోక్, శ్రీనివాస్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
నవాబుపేట: రైతుల విద్యుత్ వినియోగంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల పరిధిలోని ప్రధాన చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రావుగారి వెంకట్‌రెడ్డి, సర్పంచులు పర్మయ్య, రఫీ, పార్టీ సీనియర్ నేతలు మల్లారెడ్డి, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.