పరిగి : ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ గ్రామానికి చెందిన భూములను సేకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని శనివారం మండలంలోని కాళ్లాపూర్ రైతులు కలెక్టర్ దీపక్తివారీని కలిసి వినతిపత్రాన్ని అందిం చి విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో పట్టా భూము లు 159.25 ఎకరాలు, అసైన్డ్ భూములు 428.05 ఎకరాలు, మొత్తం 587.30 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సేకరించాలని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్తో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ భూమి తమ ఆస్తి మాత్రమే కాదని, తరాలుగా వస్తున్న తమ జీవనాధారమని తెలిపారు. ఈ భూ మిలో ప్రతి ఏటా రెండు, మూడు పంటలను పండించుకుని జీవిస్తున్నట్లు వివరించారు.