బోడుప్పల్, ఫిబ్రవరి 24: ఆలయ పునర్నిర్మానంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని బోడుప్పల్ 15వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చిగురు రేణుక రవికుమార్ తెలిపారు. డివిజన్ పరిధిలోని పోచమ్మ నాగదేవతల ఆలయ నిర్మాణానికి రూ.100,116చెక్కును ఆలయ నిర్వాహకులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆధ్యాత్మిక చింతనతో మనసు ప్రశాంతంగా ఉంటమే కాకుండా ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు.
యాంత్రికపరమైన జీవన విధానంలో ప్రతిరోజు యోగా, ఆధ్యాత్మిక చింతన తప్పకుండా కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి ఒక్కరూ ఇలాంటి దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శివారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.