రంగారెడ్డి, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): ప్రజలకు ఇబ్బంది కలిగించే సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయా లు వద్దని, ప్రజలకు అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో ఉన్న కార్యాలయాలను మరోచోటుకు తరలించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 1969లో ఇబ్రహీంపట్నంలో రిజిస్ట్రేషన్ కా ర్యాలయం ప్రారంభమైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలకు చెందిన ప్రజలకు ఇక్కడే క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్నారు.
ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం కోసం గతంలోనే రూ.కోటి కేటాయించి నూతన భవనాన్ని కూడా నిర్మించామని, ఆ భవనాన్ని పూర్తిచేసి అందులో కార్యాలయాన్ని ప్రారంభించాలని అధికా రులకు సూచించారు. ఇబ్రహీంపట్నం రిజిస్ట్రేషన్ కా ర్యాలయాన్ని ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మంఖాలలో ఏర్పాటు చేయాలని చూస్తే తాము వ్యతిరేకిస్తామన్నారు. శంషాబాద్, మహేశ్వరం, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట, రాజేంద్రనగర్ వంటి సబ్‌రిజిస్ట్రార్ కా ర్యాలయాలను కూడా మరోచోటకు మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామన్నారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీ కృపేశ్, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ చంద్ర య్య, మాజీ జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బుగ్గరాములు, రమేశ్‌గౌడ్, నాయకులు వేణుగోపాల్‌రావు, జంగయ్య, పాశ్చబాష, భాస్కర్‌రెడ్డి, జెర్కోని రాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.