ఆర్కేపురం, నవంబర్ 10 : పేదరికం, ఆకలితో అల్లాడుతున్నవారికి, దవాఖానలో రోగులకు సహాయకులుగా వచ్చిన వారికి అండగా నిలుస్తూ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ విశిష్ట సేవలు అందిస్తోంది. గాంధీ హాస్పిటల్ వద్ద రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ హైదరాబాద్లోని ప్రభుత్వ దవాఖానల వద్ద రోగులకు సహాయకులుగా వచ్చేవారికి ఈ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పేదలు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు.