కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి జాతర వైభవంగా కొనసాగుతుంది. జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం రెండోరోజు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేసి, ఆలయ ఆవరణలో శతచంఢీ హోమాన్ని ప్రారంభించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించుకున్నారు. జాతర ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ శిరోలీ, ఈవో స్నేహలత, తాసిల్దార్ ఆర్పీజ్యోతి, ఆలయ నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, ఆలయ అర్చక సిబ్బంది యాదగిరిస్వామి, బోడ్కనాయక్, చంద్రయ్య, దేవేందర్, కృష్ణ, వెంకటేశ్, శ్రీనివాస్, రాములు, రమాదేవి, విజయ్‌గౌడ్, మహేశ్‌గౌడ్, రామకృష్ణ, కుమారస్వామి, భక్తులు పాల్గొన్నారు.