ఆమనగల్లు : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులంతా నడుం బిగించి ముందడగు వేయాలని సీఐ ఉపేందర్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లు మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ చేయాలని కోరుతూ శృతిలయ కల్చరల్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే, 2కే రన్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పలువురు విద్యార్థులు, యువజన సంఘం ర్యాలీలో పాల్గొన్నారు. అంతకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన త్రీవిధ దళాదినేత బిపిన్ రావత్‌కు విద్యార్థులు, యువజన సంఘం నాయకులు నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. డైరెక్టర్ చిత్తరంజన్‌దాస్, జీహెచ్ఎం శంకర్, శ్రీధర్, కౌన్సిలర్ లక్ష్మణ్, కృష్ణ, శ్రీధర్, రాము పాల్గొన్నారు.