చేవెళ్లటౌన్ : కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం నిరుపేదింటి ఆడపడుచులకు వరంగా మారిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల తాసిల్దార్ అశోకుకుమార్ ఆధ్వర్యంలో 43మంది లబ్ధిదారులకు రూ. 43,04,988 కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, మండల అధ్యక్షుడు ప్రభాకర్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌తో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల పెండ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేద కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో మండల అద్యక్షుడు ప్రభాకర్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు శివారెడ్డి, శైలజ రెడ్డి, లక్ష్మిసత్యనారయణ, మాణిక్య రెడ్డి, ప్రభాకర్, మల్లారెడ్డి, విజయలక్ష్మి నర్సింహులు, ఆలూర్ ఉప సర్పంచ్ వెంకటేష్, డైరెక్టర్ గని, నాయకులు, వెంకటేష్, దేవర కృష్ణరెడ్డి, రవి, గిరిధర్ రెడ్డి ఉన్నారు.