వికారాబాద్, జూన్ 27: బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని పశువుల(గోవులు, లేగదూడలు) అక్రమ రవాణాను అడ్డుకుంటామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్, పశుసంవర్ధక, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ వచ్చే నెల 10వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇందుకు జిల్లాలో మొత్తం 10 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరైనా పశువులను అక్రమంగా తరలిస్తే కఠి న చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు, పశువుల వ్యాపారులు పశువుల క్రయ, విక్రయాల్లో భాగంగా గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు ధ్రువీకరించిన పత్రాలను చూపాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రషీద్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్‌కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి సారంగపాణి, వికారాబాద్, పరిగి మున్సిపల్ కమిషనర్లు, తాండూరు మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.