చేవెళ్ల రూరల్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధి ఊరెళ్ల గ్రామంలో సోమవారం రూ.5 లక్షలతో నిర్మించ తలపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముఖ్య అథిగా హాజరై ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రతి గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ జహంగీర్, వైస్ ఎంపీపీ శివప్రసాద్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ పంపిణీ
ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ పంపిణీ కార్యక్రమాన్ని చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ్ల, తంగడిపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ పంపిణీ చేసి తానూ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మొయినాబాద్, జూన్ 13 : సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే యాదయ్య అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు ఆరోగ్య ఉపకేంద్రంలో డయేరియా పక్షోత్సవాలు, మలేరియా మాసోత్సవాలను సోమవారం ప్రారంభించారు. డయేరియా, మలేరియాతోపాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతో పిల్లలతో పాటు పెద్దలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్షత్రం, సర్పంచ్ స్వరూప, అప్పోజగూడ సర్పంచ్ రాజు, ఎంపీటీసీ మల్లేశ్, ఎంపీడీవో సంధ్య, వైద్యురాలు వాణి, సీహెచ్‌వో నర్సింగ్‌రావు, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్, మాజీ సర్పంచ్ మల్లేశ్, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, మాజీ వైస్ ఎంపీపీ జీఎన్ రాజు, నాయకులు జయవంత్, నర్సింహగౌడ్, రాంచందర్, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.