తలకొండపల్లి, జూన్ 8 (మాడ్గుల) : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని సుందరంగా మార్చుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి, నర్సాయపల్లి, మాడ్గుల గ్రామ పంచాయతీలలో పల్లెప్రగతి పనుల్లో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి లైట్ల ఏర్పాటు, పారిశుధ్య పనులు, మొక్కల సంరక్షణ వంటి పనులు తప్పకుండా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పనులను పరిశీలించిన డీఎల్పీవో
యాచారం : కుర్మిద్ద, తాటిపర్తి గ్రామంలో డీఎల్పీవో సంధ్యారాణి బుధవారం పర్యటించారు. గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీడీవో విజయలక్ష్మి, సర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ బాబయ్య, ఎంపీవో ఉమారాణి, ఏపీవో లింగయ్య పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
చేవెళ్ల రూరల్ : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయని ఎంపీడీవో రాజ్‌కుమార్ తెలిపారు. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా ముడిమ్యాల గ్రామంలో సర్పంచ్ శేరి స్వర్ణలతాదర్శన్, పంచాయతీ కార్యదర్శి ఎండీ.రియాజుద్దీన్, ఊరెళ్ల గ్రామంలో వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ జహంగీర్‌తో కలిసి పల్లె ప్రగతి పనులు పరిశీలించిన అనంతరం శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ… ప్రతి ఒకరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
పట్టణ ప్రగతికి విశేష ఆదరణ
తుర్కయంజాల్ : మునగనూర్‌లోని వైకుంఠధామంలో నీటి సదుపాయం, పైపులైన్ మరమ్మతులను కౌన్సిలర్ స్వాతి పరిశీలించి మొక్కలు నాటారు. అదేవిధంగా మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతి అన్ని వార్డుల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అమరేందర్‌రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
కడ్తాల్ : మండల కేంద్రంలోని వైకుంఠధామం పరిసరాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి మొక్కలు నాటారు. గ్రామంలో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు నరేందర్‌రెడ్డి, మహేశ్, టీఆర్ఎస్ యువజన విభాగం గ్రామాధ్యక్షుడు కృష్ణ, నాయకులు దాసు, యాదయ్య, జగదీశ్, పంచాయతీ కార్యదర్శి రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఉత్సాహంగా పట్టణ ప్రగతి
పెద్దఅంబర్‌పేట: మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. కమిషనర్ రామాంజులరెడ్డితో కలిసి చైర్పర్సన్ చెవుల స్వప్న 19వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. 14వ వార్డులో కౌన్సిలర్ రోహిణిరెడ్డి ఆధ్వర్యంలో పనులు చేపట్టారు.ఆయా కార్యక్రమాల్లో నాయకులు చిరంజీవి, జోర్క రాములు, మున్సిపల్ డీఈఈ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
వివిధ గ్రామాల్లో ఎంపీపీ పర్యటన
ఇబ్రహీంపట్నంరూరల్ : తుర్కగూడ, చర్లపటేల్‌గూడ గ్రామాల్లో ఎంపీపీ కృపేశ్ పర్యటించి పనులను పరిశీలించారు. అదేవిధంగా చర్లపటేల్‌గూడలో నర్సరీని పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం
శంకర్పల్లి : పట్టణ ప్రగతి ద్వారా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మున్సిపాలిటీలో డ్రైనేజీల శుభ్రత కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్ లక్ష్మమ్మ రాంరెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు పాండురంగారెడ్డి పాల్గొన్నారు.