తాండూరు, ఏప్రిల్ 28: ప్రజల కోసం నిరంతరం పనిచేసే పోలీసులు అంటే తనకు చాలా గౌరవమని ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఉద్దేశ పూర్వకంగా తాను ఎవరినీ ఏమి అనలేదని, ఒత్తిడి, ఎమోషనల్లో ఎమైనా అని ఉంటే మన్నించాలన్నారు.
పోలీసులు తన కుటుంబ సభ్యులతో సమానమని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. కొందరు వ్యక్తులు తనను అనవసరంగా బద్నాం చేస్తున్నారని, దయచేసి అధికారులు, ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. తన జీవితం ప్రజల సేవకు అంకితమని పేర్కొన్నారు. తాండూరు ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.