బొంరాస్‌పేట, ఫిబ్రవరి 22 : గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మంది ఆశ కార్యకర్తలకు ఆయన స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బాధితులకు వైద్య సేవలు అందించారన్నారు. రోగులకు వారు వైద్య సేవలు అందించే క్రమం లో పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆశ కార్య కర్తలకు సూచించారు. అదే విధంగా వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం వారికి వేతనాలను పెం చిందని గుర్తు చేశారు. స్మార్ట్ ఫోన్లతో ఆశ కార్యకర్తలు ఎప్పటికప్పుడు రోగుల సమాచారాన్ని నమోదు చేసే అవకాశం ఉంటుందన్నారు.
కొడంగల్ పట్టణంలో నూతనంగా నిర్మించిన 50 పడకల దవాఖానను త్వరలో వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చెప్పారు. దవాఖాన ఆవర ణలో సిబ్బంది వేయిటింగ్ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షలు , ఐసీడీఎస్ ఆవరణలో కూడా అంగన్వాడీ టీచర్ల కోసం వేయిటింగ్ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా బొంరాస్‌పేట పీహెచ్సీలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేం దర్‌రెడ్డి, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల ఎంపీపీలు ముద్దప్ప దేశ్‌ముఖ్, విజయకుమార్, దౌల్తాబాద్ జడ్పీటీసీ మహిపాల్, మండల వైద్యాధికారి రవీంద్రా యాదవ్, టీఆర్ఎస్ పార్టీ మండ లాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చాంద్‌పాషా, ఎంపీటీసీలు శ్రవణ్‌గౌడ్, నారాయణరెడ్డి, పార్టీ నాయకులు మధుయాదవ్, నరేశ్‌గౌడ్, రామకృష్ణాయాదవ్, శేఖర్‌గౌడ్, సోంనాథ్, సుభాశ్‌రావు, నెహ్రూనాయక్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. మం డలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన బాల్‌రాజ్‌కు సీఎం సహాయనిధి ద్వారా వైద్య సదుపాయం కోసం మంజూరైన రూ.2 లక్షల ఎల్వోసీని మంగళవారం ఆయన అందజేశారు.