మాడ్గుల(ఆమనగల్లు), ఫిబ్రవరి 22 : కరోనా విపత్కర పరిస్థితిలో పల్లెలు, తండాల్లో ఆశలు అందించిన వైద్య సేవలు వెలకట్టలేనివి అని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలో వాసవీ ఫంక్షన్‌హాలు మాడ్గుల, ఇర్విన్ పీహెచ్సీ పరిధిలో విధులు నిర్వహించే ఆశ వర్కర్లకు ప్రభుత్వం సమకూర్చిన స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఆశల సేవలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆశల సేవలను గుర్తించి గౌరవవేతనం పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించినట్లు చెప్పారు. ఆశ కార్యకర్తలంతా వైద్య విధానంలో అమలవుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు.
మండలంలోని వాసవీ ఫంక్షన్హాల్లో మండలంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన 151 కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే ఎంపీపీ పద్మారెడ్డితో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. అనంతరం కొత్తబ్రాహ్మణపల్లి, ఆవురుపల్లి, బాలుతండా, అందుగుల, అన్నెబోయిన్పల్లి గ్రామాలకు చెందిన బాధితులకు రూ.2లక్షల సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ శంకర్‌నాయక్, తాసిల్దార్ కృష్ణ, ఎంపీడీవో ఫారూక్‌హుస్సేన్, వైద్యురాలు లలిత, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రవి, సర్పంచులు అంబాల జంగయ్య, రమేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ రాజవర్ధన్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నిరంజన్, టీఆర్ఎస్ నాయకులు ధర్మారెడ్డి, కృష్ణారెడ్డి, వరుణ్, చలమందగౌడ్ పాల్గొన్నారు.