అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 21 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగితేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీపీ బుర్ర రేఖ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. సమావేశంలో జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీవో మమతబాయి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.