షాద్‌నగర్, డిసెంబర్ 21: ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు కావలి భాస్కర్, పలువురు నాయకులు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. సంక్షేమం అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధి అనే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పథంలో తెలంగాణ ముందుకు సాగుతున్నదన్నారు. 19వ వార్డుకు చెందిన కావలి భాస్కర్, రాములు, అంజన్న, నర్సింలు, నరేష్, మల్లేష్, మల్లయ్య, భాస్కర్, విష్ణు, చిన్న, రుక్కయ్య, నాగబాబు, రాజు, నవీన్, లక్ష్మణ్, రామకృష్ణ, రాములు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, నాయకులు జమృత్, చెన్నయ్య, గౌస్జానీ పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
షాద్‌నగర్ పట్టణంతో పాటు ఫరూఖ్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం సహాయనిధితో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ భీష్వ రామకృష్ణ, గ్రంథాలయ కమిటీ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, మండలాధ్యక్షడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు మన్నె నారాయణ, హరి, శంకర్, శేఖర్ పాల్గొన్నారు.
పథకాలు దేశానికే ఆదర్శం
కొత్తూరు: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.కొత్తూరు మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒక వైపు అభివృద్ధికి, మరోవైపు సంక్షేమానికి జోడు గుర్రాల్లా పరిగెత్తిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీలత, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య, ఎంపీడీవో శరత్చంద్రబాబు, తహసీల్దార్ రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్ శ్రీనివాసులు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు రవీందర్‌రెడ్డి, అంజమ్మ, సర్సంచ్‌లు వసుంధర, రవినాయక్, సాయిలు, సత్తయ్య, కాట్న రాజు, అజయ్‌నాయక్, నాయకులు దేవేందర్‌యాదవ్, ఎమ్మె సత్యనారాయణ, లింగంనాయక్ పాల్గొన్నారు.
క్రిస్మస్ కానుకలు అందజేత
కొత్తూరు ఎంపీడీవో కార్యాయలంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని మతాలను సమాన గౌరవంతో చూసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 150 మంది క్రైస్తవులను కానుకలు అందజేశారు.
నందిగామ : రంగాపూర్ గ్రామానికి చెందిన అనితకు మంజూరైన రూ.2 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, నాయకులు రవికుమార్, భాస్కర్, నరసింహ, శ్రీశైలం పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : షాద్‌నగర్ పట్టణంలోని సాయిరాం ఫంక్షన్హాల్లో క్రైస్తవులకు ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ శాంతమ్మ, తహసీల్దార్ గోపాల్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.