ఒకప్పుడు మారుమూల గ్రామం.. నేడు మండల కేంద్రం.. నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఊరు.. ప్రస్తుతం ప్రగతిపథంలో ముందున్నది. గ్రామస్తులకే కాదు ఇతర రాష్ర్టాలకు చెందినవారికీ పని కల్పిస్తూ ఉపాధిపేటగా పేరొందుతున్నది నవాబుపేట గ్రామం. ప్రత్యేక మండలంగా ఏర్పాటుతో నవాబుపేటకు మహర్దశ వచ్చింది. స్థానికంగా ప్రభుత్వ కార్యాలయాలతోపాటు బ్యాంకు, గ్రంథాలయం, హాస్టళ్లు, మార్కెట్లు ఏర్పాటు కావడంతో ఉపాధికి కేంద్ర బిందువుగా మారింది. ఎంతోమంది వ్యవసాయ పనులు, వెల్డింగ్, ఎలక్ట్రికల్ షాపులు, హోటళ్లు, ఉడ్వర్క్ తదితర పనులతో ఉపాధి పొందుతున్నారు. ఇతర రాష్ర్టాలవారు సైతం ఇక్కడకు వలసొచ్చి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉండడం గ్రామస్తులకు కలిసొచ్చింది.
నవాబుపేట, అక్టోబర్ 15: గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో వెనుకబడిన మండల కేంద్రం .. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది. ఒకప్పుడు మారుమూల గ్రా మం కాగా నేడు మున్సిపాలిటీలకు దీటుగా ప్రగతి సాధిస్తున్నది. ప్రస్తుతం కార్గో బస్సు సర్వీసులు కూడా తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే కాలె యాదయ్య సొంత మండలం కావడంతో ఆయ న ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నవాబుపేట అభివృద్ధికి అధికంగా నిధులను మంజూరు చేస్తున్నారు.
ఇంటింటికీ భగీరథ తాగునీటి కలెక్షన్లు, మరుగుదొడ్లు, గ్రామం మొత్తం సీసీ రో డ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండల కేంద్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం ప్రతినెలా కేటాయిస్తున్న నిధులతో సర్పంచ్, అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుతున్నారు.
ప్రతిరోజూ ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించి గ్రామ చివరలో ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అంతేకాకుండా మండల కేం ద్రంలోనే ప్రజల అవసరాలను తీర్చేందుకు తహసీల్దార్, ఎంపీడీ వో కార్యాలయాలు, పోలీస్స్టేషన్, పీహెచ్సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేవాలయాలు, పోస్టాఫీసు, గ్రంథాలయం, పల్లెప్రకృతివనం, నర్సరీ, బీసీ, ఎస్సీ హాస్టళ్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు, రైతువేదిక భవనం, తెలంగాణ క్రీడాప్రాంగణం, వైకుంఠధా మం వంటివి ఏర్పాటు చేశారు.
ఎమ్మె ల్యే యాదయ్య సహకారంతో వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ప్రతి శుక్రవారం మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ సంతకు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వస్తుంటారు.మండల కేంద్రానికి పశ్చిమంలో వికారాబాద్ జిల్లా కేంద్రం, తూర్పున రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, సమీపంలో చిట్టిగిడ రైల్వేస్టేషన్ ఉండటంతో హైదరాబాద్ నగరానికి 45నిమిషాల్లో చేరుకోవచ్చు. దీంతో మండలానికి చెందినచాలామంది ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ప్రతిరోజూ నగరానికి ఈ రైలు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.
భూముల ధరలు పెరిగి కోట్లాది రూపాయలు పలుకుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల సీఎం కేసీఆర్ ప్రభుత్వం మండలంలోని ఆర్కతల గ్రామం లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్య లు చేపట్టింది. పనులు కూడా ప్రారంభమయ్యా యి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మండల కేంద్రంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగా యి. వ్యవసాయ పనులు, వెల్డింగ్, ఎలక్ట్రికల్ షాపులు, హోటళ్లు, ఉడ్వర్క్ తదితర పనుల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. మండలంలోని ఇతర గ్రామాలకు చెందిన ప్రజలతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన ప్రజలు కూడా మండల కేంద్రానికి వచ్చి పనులు చేసుకుని జీవిస్తున్నారు.
పరిశుభ్రంగా గ్రామం..
సర్పంచ్ విజయలక్ష్మి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. గ్రామంలోని ఎనిమిది వార్డులను పల్లెప్రగతిలో భాగం గా సుందరంగా మార్చారు. ప్రతిరోజూ పారిశుధ్య సిబ్బంది అన్ని వార్డులను శుభ్రం చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించడంతోపాటు పాత పాడుబడిన ఇండ్లను పూడ్చివేయించారు.
పారిశుధ్య సిబ్బంది ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొ డి చెత్తను ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ సహాయంతో గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించి.. అక్కడ సేంద్రియ ఎరువు ను తయారు చేస్తున్నారు. ఆ ఎరువును హరిత హారం మొక్కలను వినియోగిస్తున్నారు. గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా నాటి న హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి సందర్శకులను ఆకట్టుకుంటున్నారు. పల్లెప్రకృతివనం, నర్సరీల్లో మొ క్కలను నాటి సంరక్షిస్తున్నారు. వాటికి ప్రతిరోజూ నీటిని వనసంరక్షుడు అందిస్తున్నాడు.
ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతోనే..
ఎమ్మెల్యే కాలె యాదయ్య సొంత మండలం కావడంతో ఆయన ప్రత్యే క శ్రద్ధ చూపుతున్నారు. అడిగిన వెంటనే నిధులను మంజూరు చేస్తున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నవాబుపేట అభివృద్ధిలో వెనుకబడింది. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాతే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నది. భూముల ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. ఎకరానికి రూ. కోట్లలో ధరలు పలుకుతున్నాయి. గ్రామం మొత్తం సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించా. ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు అందుతున్నది. గతంలో నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడేది. ప్రస్తుతం ఉదయం ఆరున్నర గంటలకే నీటి సరఫరా జరుగుతున్నది. ఇది అంతా సీఎం కేసీఆర్ చలువే.. సీఎంకు గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
-న్యాలం విజయలక్ష్మి, సర్పంచ్ నవాబుపేట
‘పల్లెప్రగతి’తో మారిన రూపురేఖలు
పల్లెప్రగతి కార్యక్రమంతో నవాబుపేట రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రభుత్వం కేటాయిస్తు న్న నిధులతో సర్పం చ్, అధికారులు గ్రా మాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వైకుంఠధామం, పల్లెప్రకృతివనం వం టి పలు అభివృద్ధి పనులను చేపట్టారు. దీం తో గ్రామంలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలతోపాటు కర్ణాటక రాష్ర్టానికి చెందిన వందలాది మంది కూలీలు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఎమ్మెల్యే యాదయ్య మార్కెట్ కమిటీని తీసుకువచ్చి రైతులను బాగా అభివృద్ధి చేస్తున్నారు.
-ప్రకాశ్, గ్రామస్తుడు