షాద్‌నగర్‌రూరల్, ఫిబ్రవరి 3 : పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసానిస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన నర్సింహులు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించుకుంటున్నాడు. సీఎం సహాయనిధి ద్వారా లక్ష రూపాయల ఎల్వోసీని మంజూరు కాగా, గురువారం నర్సింహులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు పాల్గొన్నారు.