తాండూరు, ఫిబ్రవరి 3: సర్కారు బడులను ప్రైవే ట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే ‘మన ఊరు-మనబడి’కి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వపాఠశాలల్లో మౌలిక వసతుల ను కల్పించడంతోపాటు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలో సమస్యలకు నిలయంగా మారిన తాండూ రు పట్టణంలోని భవానీనగర్కాలనీలోని ప్రభుత్వ నంబర్-1 ఉన్నత పాఠశాల ప్రస్తుతం అభివృద్ధివైపు దూసుకుపోతున్నది. విద్యార్థుల్లో సృజనాత్మకత, చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు దాతలు, పాఠశాల ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతోపాటు ఉపాధ్యాయులు తమ జీతంలోంచి రూ.1000 నుం చి రూ.1500 వేసుకొని పాఠశాలలో విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా జాతీయ నాయకుల చిత్రపటాలు, మానవుడి జీవన విధానం, విద్యార్థుల క్రమశిక్షణ వంటి పలు చిత్రపటాలు, పాఠశాల క్రీడా ప్రాంగణంలో మట్టి పోయించి ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
ఉపాధ్యాయులు చేస్తున్న అభివృద్ధి పనులను గమనించిన స్థానిక కౌన్సిలర్ రత్నమాలానర్సింహు లు తన వంతు సాయంగా ఎస్ఏఆర్ ట్రస్టు నుంచి పాఠశాలలో తాగునీటికోసం బోరును వేయించడంతోపాటు విద్యార్థులు తాగేందుకు మున్సిపల్ నుంచి నీటి కుళ్లాయి కనెక్షన్ను కూడా ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా స్థానికులైన బంటు వేణుగోపాల్ డోర్లు, మల్కాపూర్ మల్లేశ్ స్టేజీ నిర్మాణంతోపాటు పలువురు దాతలు పలు వసతులను కల్పిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో విద్యార్థులకు మరుగుదొడ్లను నిర్మించారు. 2013-14 నుంచి తెలుగు మీడియంతోపాటు ఆంగ్ల మాధ్యమంలోనూ బోధనను ప్రారంభించారు. ప్రస్తుతం ఆరు నుంచి పదోతరగతి వరకు స్కూల్లో 736 మంది విద్యార్థులు చదువుతున్నారు. హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు ఏపు గా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది.
ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, సన్నబియ్యంతో కూడిన భోజనంతోపాటు అర్హత కలిగిన టీచర్లు ఉండటంతో ప్రైవేటు పాఠశాలల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తాండూరు పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లోంచి ఈ ఏడాది భవానీనగర్కాలనీలో ఉన్న ప్రభుత్వ నంబర్-1 పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరారు.
ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క రూ ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి. నంబర్-1 ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని బోధించనప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య చాలా పెరిగింది. ఇక్కడ సౌకర్యాలతోపాటు ఆంగ్ల మాధ్యమంలో బోధన బాగుండటంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలో మరిన్ని వసతులు మెరుగుపడతాయి.
-శశిరేఖ, ఆంగ్ల ఉపాధ్యాయురాలు
ప్రభుత్వ నిధులతోపాటు ఉపాధ్యాయులు, స్థానిక నేతల సమష్టి కృషితో పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో కలిపి 736 మంది విద్యార్థులు చదువుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని బడు ల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటు ్న నేపథ్యంలో పాఠశాలకు ప్రత్యేక నిధులు రావడంతోపాటు, మౌలిక వసతులు కూడా పెరుగుతాయి. -జె.వెంకటయ్య హెచ్ఎం, ఎంఈవో