పరిగి, ఆగస్టు 9 : స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కోరారు. మంగళవారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే విధంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు.
ప్రతి ఇంటికీ జాతీయ జెండా అందజేస్తామని, ప్రతి పౌరుడు ఉత్సవాల్లో పాలు పంచుకోవాలన్నారు. ప్రభుత్వం సూచించిన వజ్రోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఊరూరా వజ్రోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేపట్టాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ హరి ప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయ కులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ నాగరాజు, సర్పంచ్‌లు, కౌన్సి లర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పూడూరులో జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల, దోమలో ఎంపీపీ అనుసూజ, వైస్ ఎంపీపీ మల్లేశం, కులకచర్లలో జడ్పీటీసీ రాందాస్‌నాయక్, మార్కెట్ చైర్మన్ హరికృష్ణ జాతీయ జెండాలను పంపిణీ చేశారు.