కొడంగల్ : మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజును ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డులో పర్యటించిన ఆయన కొనసాగుతున్న మురుగుకాలువల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయ ని, దీంతో ప్రజలు ఇబ్బందులకు గురికాల్సి వస్తుంది కాబట్టి వెంటనే పనులను వెగవంతం చేయాలని సూచించా రు. కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్యాదవ్తో పాటు కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.