షాబాద్, మే 26 : వయో వృద్ధులు, దివ్యాంగులు కొవిడ్ టీకా నమోదు చేసుకోవడానికి, సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా మహిళ, శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్‌పోస్టర్‌ను బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ విడుదల చేశారు. దీనికి సంబంధించిన హెల్ప్‌లైన్ నెంబర్లు వయో వృద్ధులు 14567, దివ్యాంగులు 18005728980లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మోతి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.