తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. జాతీయ జెండాలను ఎగురవేసి, అమరవీరుల చిత్రపటాల వద్ద నివాళి అర్పించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆయా నియోజకవర్గాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉవ్వెత్తున్న ఎగసిపడ్డ తెలంగాణ ఉద్యమాన్ని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. సంక్షేమ పథకాల అమలుతో ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా క్రీడా మైదానాలను ఎమ్మెల్యేలు ప్రారంభించారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇబ్రహీంపట్నం, జూన్ 2 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై చైర్పర్సన్ స్రవంతి, ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయంపై చైర్పర్సన్ ఆర్తిక, తుర్కయాంజాల్ మున్సిపల్ కార్యాలయంపై చైర్పర్సన్ అనురాధ, పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ కార్యాలయంపై చైర్పర్సన్ చెవుల స్వప్న జాతీయ జెండాలను ఎగురవేశారు. మంచాల మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ నర్మద, యాచారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ సుకన్య, అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిషత్ కార్యాలయంపై ఎంపీపీతో పాటు ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంపై ఏసీపీ ఉమామహేశ్వర్రావు, కోర్టులో జడ్జితో పాటు ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అనంతరం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ…పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు.
షాద్‌నగర్ / షాద్‌నగర్‌టౌన్ : ప్రజా సంక్షేమ పథకాల అమలుతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్, మండల పరిషత్, గ్రంథాలయంలో నిర్వహించిన ఆవిర్భావ డుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాలను ఎగురవేశారు. కేశంపేటలో ఎంపీపీ వై. రవీందర్‌యాదవ్, నందిగామ మండల కేంద్రంలో ఎంపీపీ ప్రియాంక, కొత్తూరు మండల కేంద్రంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, కొందుర్గు, చౌదరిగూడ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
షాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. గురువారం చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య జెండా ఎగురవేశారు. అదే విధంగా షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : గ్రామీణ యువకుల్లో దాగియున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొస్తున్నదని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని చర్లపటేల్‌గూడ గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ మహిపాల్, వైస్‌ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్‌రెడ్డి, సర్పంచ్ గీత, ఎంపీటీసీ ఆంజనేయులు పాల్గొన్నారు.
కడ్తాల్ : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. కర్కల్‌పహాడ్, రేఖ్యాతండాలోని క్రీడా ప్రాంగణాలను ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్‌లు హరిచంద్, నాగమణి, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, మంజులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మంగల్‌పల్లిలో ఎంపీపీ అనిత, జడ్పీటీసీ అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, సర్పంచ్ నర్సింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, యాదయ్య, భాగ్యమ్మ, ఎంపీడీవోలు రామకృష్ణ, వెంకట్రాములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ, ఉప సర్పంచ్ ఎల్లాగౌడ్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్/రూరల్ : మున్సిపాలిటీలోని 6, 7, 9వ వార్డుల్లో, ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్టలో క్రీడా ప్రాంగణాలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్లు లత, సలేంద్రం రాజేశ్వర్, ప్రతాప్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
నందిగామ : వీర్లపల్లి, రంగాపూర్ గ్రామాల్లో క్రీడా మైదానాలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ప్రియాంకతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, సర్పంచ్‌లు రమేశ్‌గౌడ్, రాములమ్మ, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు లత, రాష్ట్ర నాయకురాలు రాజ్యలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : కొహెడలోని క్రీడా ప్రాంగణాన్ని మున్సిప ల్ చైర్పర్సన్ అనురాధ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ హరిత, కమిషనర్ జ్యోతి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మంచాల : ఆగపల్లి, మంచాల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు క్రీడా పనులను ఎంపీపీ నర్మద ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నిత్య, సర్పంచ్‌లు జంగయ్య, జగన్‌రెడ్డి, ఎంపీటీసీలు సుకన్య, నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ అనిత, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో వీరాంజనేయులు పాల్గొన్నారు.
యాచారం : గున్‌గల్‌లో ఆట స్థలాన్ని ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ఇందిర, ఉపసర్పంచ్ భీం యాదవ్ పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : కందవాడలో ఎంపీడీవో రాజ్‌కుమార్, ఎంపీవో విఠలేశ్వర్‌జీ, ఆర్డీవో వేణుమాధవ్రావుతో కలిసి ఎంపీపీ విజయలక్ష్మి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ తదితలు పాల్గొన్నారు.
శంకర్పల్లి : మండలంలోని సంకేపల్లి, పర్వేద గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో వెంక య్య, సర్పంచ్ ఇందిర, ఎంపీటీసీ మేఘన సంజీవరెడ్డి, వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కావలి గోపాల్ పాల్గొన్నారు.
కేశంపేట : అల్వాల్ గ్రామంలో క్రీడా మైదానం నిర్మాణ పనులను ఎంపీపీ రవీందర్‌యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఉససర్పంచ్ దామోదర్‌రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జగదీశ్వర్‌గౌడ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి ఉన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్: గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రీడా మైదానాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎంపీపీ రేఖ అన్నారు. మజీద్‌పూర్, జాఫర్‌గూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా మైదానాలను జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్, సర్పంచ్‌లు పోచంపల్లి సుధాకర్‌రెడ్డి, కొర్ర లావణ్యతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మమతాబాయి, ఉపసర్పంచ్లు గడ్డం బాలకృష్ణగౌడ్, డి శేఖర్, కార్యదర్శులు, వార్డుసభ్యులు తదితరులు ఉన్నారు.