చూస్తుండగానే విద్యార్థులకు వేసవి సెలవులొచ్చేశాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు (1 నుంచి 9వ తరగతి వరకు)నేటి నుంచి వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజు శనివారం విద్యార్థులకు మార్కుల జాబితాలను అందజేశారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవు లు కొనసాగి తిరిగి జూన్ 12న బడులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తరగతి గదుల్లో, పాఠశాలల ఆవరణల్లో ఒకరికొకరు షేక్హ్యాండ్లు ఇచ్చుకున్నారు.
దోస్తులంతా గుంపులుగా చేరి ఆలింగనం చేసుకున్నారు. కొవిడ్ వైరస్ అనంతరం ఈ ఏడాది పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వేసవి సెలవులు రావడంతో ఆనందంగా ఇంటిబాట పట్టారు. హాస్టల్ విద్యార్థుల సంతోషం అంతా ఇంతా కాదు. ట్రంకు పెట్టె చేత పట్టుకొని బస్టాండ్లకు వెళ్లడంతో అన్ని బస్టాండ్లు విద్యార్థులతో సందడిగా మారా యి. విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంగా వచ్చి వారి పిల్లలను తమ ఇండ్లకు తీసుకెళ్లారు.
-హయత్నగర్ రూరల్, ఏప్రిల్23