చేవెళ్లటౌన్, ఏప్రిల్ 5: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కో సం నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పూలమాలలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కేసారం సర్పంచ్ రమేశ్ , మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మాణిక్యరెడ్డి, డైరెక్టర్ యాదగిరి, నాయకులు యాదగిరి,రామకృష్ణ పాల్గొన్నారు.
-ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5: బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నంలోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ యాదగిరి, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్
షాద్‌నగర్ : దేశంలోని దళిత, బహుజనుల బాగుకోసం బాబూ జగ్జీవన్‌రామ్ ఎనలేని కృషిచేశారని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్‌గౌడ్, నియోజకవర్గంలోని ప్రజా, ఉద్యోగ,కార్మిక, దళిత సంఘాల నాయకులను అభినందించారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్ మండల పరిషత్ ఆవరణలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్నయాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబాబునాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నందిగామ : మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చెన్నగళ్ల వెంకటయ్య ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, జడ్పీ వైస్ ఈట గణేశ్లతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, జట్ట కుమార్, రమేశ్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, ఎంపీటీసీ కొమ్ముకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, ఉపసర్పంచ్ కుమార్‌గౌడ్ ఉన్నారు.
యాచారంలో..
జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ అన్నారు. మండలంలో బాబూ జగ్జీవన్‌రాం జయంతి వేడుకలను మండల కేంద్రంలో జడ్పీటీసీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ ఉత్సవ కమిటి సభ్యులు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బండిమీది కృష్ణ, నాయకులు చిన్నోళ్ల యాదయ్య, మస్కు రమేశ్, మారోజు శ్రీనివాస్, బొల్లంపల్లి వెంకటేశ్ పాల్గొన్నారు.
ఆదిబట్లలో..
బాబూ జగ్జీవన్‌రాం జయంతి వేడుకలను ఆదిబట్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. చింతపల్లిగూడ గేట్ వద్ద జగ్జీవన్‌రాం విగ్రహానికి టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు కొప్పు జంగయ్య పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణంరాజు, మౌనిక, నాయకులు సుధాకర్, నరేశ్, సీహెచ్ రాజ్‌కుమార్, కొప్పు దర్శన్, రమేశ్ ఉన్నారు.
కేశంపేట : బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మండ ల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, వైస్ ఎంపీపీ అనురాధ, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో రవిచంద్రకుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, శ్రావణ్ ఉన్నారు.
కడ్తాల్ :బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు కృషి చేయాల ని జడ్పీటీసీ దశరథ్‌నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్ల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. మండల వ్యాప్తంగా జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. కార్యక్రమం లో ఏఎంసీ డైరెక్టర్ లాయక్‌అలీ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు రాఘవేందర్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు వెంకటేశ్, అం బేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు దాసు పాల్గొన్నారు.
మొయినాబాద్ : స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు పాత్ర పోషిస్తూ, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు బాబు జగ్జీవన్‌రామ్ అని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామం చౌరస్తాలో జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా అజీజ్‌నగర్ గ్రామ సర్పంచ్ సంధ్య, ఎంపీటీసీ సుజాత, మొయినాబాద్‌లో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ బేగరి రాజు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కె నర్సింహారెడ్డి, రవియాదవ్,, దర్గ రాజు, శ్రీశైలం, మహేందర్, జెన్నారెడ్డి, తిరుపతిరెడ్డి, హన్మంత్‌యాదవ్, పరమేశ్, నీలకంఠం, భాస్కరాచారి, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌లు నవీ న్, హరినాథ్, మాజీ ఎంపీటీసీలు మాణిక్‌రెడ్డి, ఆనంద్, అంబేద్కర్ సంఘం సభ్యులు శ్రీనివాస్, రాజమహేంద్రవర్మ, నర్సిములు, రాజేందర్ ఉన్నారు.
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు చౌదరిగూడ మండలంలో జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు మురళీయాదవ్, రామకృష్ణ, కావలి యాదయ్య, దూలయ్య పాల్గొన్నారు.
షాబాద్ : జగ్జీవన్‌రామ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సర్దార్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూద యాదయ్య, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఏండీ చాంద్‌పాషా అన్నారు. జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా హైతాబాద్ గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రాజుగౌడ్, దర్శన్, గోపాల్, శివకుమార్ తదితరులున్నారు.
కొత్తూరు రూరల్ : నేటి యువత మహనీయులను ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో పయనించాలని పెంజర్ల సర్పంచ్ మామిడి వసుంధర అన్నారు. సిద్దాపూర్, కొడిచర్ల, శేరిగూడబద్రాయపల్లి, ఇన్ముల్‌నర్వ, పెంజర్ల, తీగాపూర్, మల్లాపూర్, గూడూరు, మక్తగూడ గ్రామాల్లో నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల్లో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళి అర్పించారు.
మంచాల : మండల కేంద్రంలోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆరుట్లలో సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులతో కలిసి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు చీరాల రమేశ్, బహదూర్, ఎంపీపీ జాటోతు నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, నాయకులు చంద్రయ్య, కిషన్‌రెడ్డి, జంగారెడ్డి, రాజు, సురేశ్, జానీపాషా, శంకర్ పాల్గొన్నారు.
కొత్తూరు : బాబూ జగ్జీవన్‌రాం సేవలు మురువలేనవని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రవీందర్, కౌన్సిలర్లు చంద్రకళ, శ్రీనివాస్, జయమ్మ, టీఆర్ఎస్ నాయుకులు దేవేందర్‌యాదవ్, యాదయ్య, జనార్దనాచారి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్, మున్సిపల్ మేనేజర్ కుమార్ పాల్గొన్నారు.
శంకర్‌పలి : కులరహిత సమాజం కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాబూ జగ్జీవన్‌రామ్ అని శంకర్పల్లి పీఏసీఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మహాలింగపురం గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో జగ్జీవన్‌రామ్ విగ్రహ ఏర్పాటుకు రూ.50 వేల నగదును నిర్వాహకులకు అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యాదగిరి, ఏఎ ంసీ డైరెక్టర్ జంగయ్య, నాయకులు నల్లోల్ల మాణిక్యం, బోడ వెంకటయ్య, సత్యం, విఠల్, రాంచందర్, యాదయ్య, దాసు తదితరులు పాల్గొన్నారు. శంకర్‌పల్లిలో జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, గుడిమల్కాపూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ డీ.వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, కౌన్సిలర్లు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పెద్దఅంబర్‌పేట : పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలోజగ్జీవన్రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్‌చైర్‌పర్సన్ సంపూర్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : సర్పంచ్ చెరుకు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జగ్జీవన్‌రామ్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుండె రవీందర్, ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ సత్యనారాయణ, కోఆప్షన్‌సభ్యుడు ఎండీ నసీరుద్దీన్ పాల్గొన్నారు.
ఆమనగల్లు : మండల కేంద్రంలో జగ్జీవన్‌రామ్ జయంతిని నిర్వహించారు.ప్రజా సంఘాలు, బహుజన నాయకులు ఆయ న చిత్రపటానికి పూలమాలేసి నివాళి అర్పించారు. కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ స మితి రాష్ట్ర కార్యదర్శి నర్సింహ, కౌన్సిలర్లు లక్ష్మణ్, కృష్ణ నాయకులు నిరంజన్, వెంకటేశ్, భాస్కర్, యాదయ్య ఉన్నారు.
మాడ్గుల : నాగిళ్ల గ్రామంలో దళిత, బహుజన సంఘాల నాయకులు ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. కార్యక్రమం లో ఏఎంసీ డైరెక్టర్ సుభాశ్, చంద్రం, చెన్నయ్య, వెంకటయ్య, మహేశ్, ప్రవీణ్‌కుమార్, శేఖర్,యాదయ్య ఉన్నారు
తలకొండపల్లి : వివిధ గ్రామాల్లో జగ్జీవన్‌రామ్ చిత్రప టానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్ర మంలో సర్పంచ్ లలిత, ఉపసర్పంచ్ అనిల్, వార్డు సభ్యు లు పాండు, స్వరూప, యశోద, శ్రీను పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : తుర్కయాంజాల్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండూరి వెంకటేశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రమావత్ కల్యాణ్ నాయక్, టీఆర్ఎస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు