ప్రజాభిప్రాయం సేకరించకుండా జీహెచ్ఎంసీలో శివారు ప్రాంతాలను విలీనం చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించాయి. తక్షణమే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రజాభిప్రాయం సేకరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు శంషాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. ఈ విషయమై ప్రభుత్వానికి ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా పెడచెవిన పెడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండ్లగూడ, ఫిబ్రవరి 11: ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే ప్రభుత్వం శివారు ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం పట్ల రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజేంద్రనగర్‌ను సైబరాబాద్‌లో కాకుండా హైదరాబాద్‌లో కలపడం వల్ల తాము అనేక ఇబ్బందులకు గురవుతమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోవడంతో వారు తీవ్ర ఆందోళన తెలిపారు.
బండ్లగూడలో రాజేంద్రనగర్ సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు ఆధ్వర్యంలో బండ్లగూడ కూడలి వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్‌రెడ్డి, రాముడు యాదవ్, వెంకటేష్, రవికుమార్, ఇస్మాయిల్, శాంతికుమార్, పెంటయ్య యాదవ్, నవీన్, పాండు, శాంతినాయక్, రాజేష్, రాజ్‌కుమార్, స్యామ్యూల్, చంద్రశేఖర్, ఇంతియాజ్, రంజిత్, చంద్రరావు, టి.పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం దారుణమని హైదర్‌గూడ చౌరస్తాలో చెట్టిగారి నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మకు అగ్గి పెట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోలన్ సుభాష్‌రెడ్డి, పోరెడ్డి ధర్మరెడ్డి, రావుల జంగయ్య, జలగం చిత్తారి, అజయ్‌కుమార్, శ్రీవర్ధన్‌రెడ్డి, సదానంద్, రాజేష్, గిరి, ముఖేష్, హరీష్, ఆనంద్, ప్రవీణ్, మధు, యాదగిరి, సాయి, తేజ తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలి
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 11 : శంషాబాద్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ లీగల్‌సెల్ కన్వీనర్ కొన్నమొల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసిన శంషాబాద్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శంషాబాద్‌ను గ్రేటర్లో విలీనం చేసి ఇక్కడి ప్రజలకు తీవ్ర ఆన్యాయం చేస్తున్నారని మండిపడారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు జోన్లుగా విభజించి ప్రభుత్వం మిగిత రెండు జోన్లను 35 లక్షల జనాభా ఉన్న వాటిని ప్రత్యేక జోన్‌గా ప్రకటించిందని తెలిపారు. శంషాబాద్జోనలో 17 డివిజన్లు ఉన్నాయి. వాటిని ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మురళిగౌడ్, హరికృష్ణ, అర్జున్, పవిత్రసాగర్, శ్రీకాంత్‌యాదవ్, దేవేందర్, యాదగిరి, గౌస్‌పాషా, శివ, టిల్లు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలి
గ్రేటర్ హైదరాబాద్‌లో కాకుండా శంషాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచర్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రత్యేక జోన్‌గా ప్రకటించే వరకు ఊరుకునేదిలేదని హెచ్చరించారు. శంషాబాద్‌లో జీవో 111 ఉండడంతో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం శంషాబాద్‌ను ప్రత్యేక కార్పోరేషన్‌గా ప్రకటించాలని కోరారు.