అంకితభావంతో పనిచేశారు
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ప్రజా సమస్యలను పరిష్కరించి, అభివృద్ధికి సహకరించినందుకు జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్‌కు ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం జోనల్ ఆఫీస్‌లో జడ్సీని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు మాట్లాడుతూ... ఎమ్మెల్యే కృష్ణారావు, స్థానిక అధికారుల సహకారంతో ఐదు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలను పరిష్కరించామన్నారు.
- ఎమ్మెల్యే కృష్ణారావు అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు మాజీ కార్పొరేటర్ల కృతజ్ఞతలు
కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 11 : కూకట్పల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో ప్రజా సమస్యలను పరిష్కరించి, అభివృద్ధికి సహకరించినందుకు జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్‌కు ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం జోనల్ ఆఫీస్‌లో జడ్సీని శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు మాట్లాడుతూ… ఎమ్మెల్యే కృష్ణారావు, స్థానిక అధికారుల సహకారంతో ఐదు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలను పరిష్కరించామన్నారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఆయా సర్కిళ్లు… వార్డుల వారీగా ప్రజా సమస్యలను జడ్సీ, డీసీల దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించారని కొనియాడారు. ఎమ్మెల్యే, స్థానిక అధికారుల సహకారంతోనే కార్పొరేటర్లుగా సేవలను విజయవంతంగా అందించామని, కాలనీలు, బస్తీలలో అభివృద్ధి పనులను పూర్తిచేశామని తెలిపారు. భవిష్యత్‌లో ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఇదే తరహాలో స్పందించాలని కోరారు. పదవి కాలం ముగిసినా నిర్విరామంగా ప్రజలకు అందుబాటులో ఉండి… ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, పగుడాల శిరీష, ఆవుల రవీందర్‌రెడ్డి, ముద్దం నర్సింహాయాదవ్, పండాల సతీష్‌గౌడ్, సబిహాబేగం, మహేశ్వరి శ్రీహరి, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబురావు, తూము శ్రావణ్‌కుమార్, గౌసుద్ధీన్ తదితరులు ఉన్నారు.
కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సన్మానం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అంకితభావంతో పనిచేశారని… ఎమ్మెల్యే కృష్ణారావు అభినందించారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే కృష్ణారావుకు మాజీ కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలుపగా… వారిని ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కార్పొరేటర్ల పాత్ర కీలకమన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, కాలనీలు, బస్తీల అభివృద్ధికి కృషిచేశారన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

