ముంబై, ఫిబ్రవరి11 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యంత సంపన్నమైన ముంబై పాలక సంస్థ పీఠాన్ని బీజేపీ, శివసేన కూటమి కైవసం చేసుకుంది. దాంతో గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉతంఠకు తెరపడింది. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత, అధికారుల పాలన నేడు ముగిసింది.
ముంబై కార్పొరేషన్ మేయర్గా బీజేపీకి చెందిన రీతూ తావడే, డిప్యూటీ మేయర్గా శివసేన (షిండే) పార్టీకి చెందిన సంజయ్ ఘాడి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.