పెద్దఅంబర్‌పేట, మార్చి 23 : గ్రేటర్ హైదరాబాద్ మురుగుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కుం ట్లూర్ భూదాన్ కాలనీ వరకు పైపులైన్ ద్వారా ఇప్పటికే తరలించామని, ఇక్కడి నుంచి పసుమాముల చెరువుకు అక్కడి నుంచి మూసికి మురుగు తరలించేందుకు పనులు తొందరలో ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. భూదాన్ కాలనీలో పారుతున్న మురుగును స్థానికులు, అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. మురుగుతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ఇటీవల మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. అదే విధంగా వరద నీరు కూడా తరలించేందుకు ప్రణాళికలు పూర్తి చేయనున్నామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరద నీటి తరలిం పు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పనులు చేపట్టే సమయంలో స్థానికులు కూడా సహకరించాలని కోరారు. మురుగు బహిరంగంగా వస్తుండటంతో దుర్వాసనతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దోమల కారణంగా సాయంకాలానికే ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి దాపురించిందని చెప్పారు. కుంట్లూర్ నుంచి మురుగు తరలింపునకు మొదటి దశలో రూ. 14.50 కోట్ల నిధులతో తరలించారన్నారు. రూ.32.50 కోట్ల నిధులతో వారంలో పనులు చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ సంపూర్ణారెడ్డి, కమిషనర్ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు గ్యారాల శ్రీనివాస్, హరిశంకర్, జోర్క గీత, కృష్ణారెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ఈదమ్మల బలరాం, జోర్క రాము, పెద్దిటి శ్రీనివాస్‌రెడ్డి, మడుగుల వెంకటేశ్, బంగారు శశి, జోర్క శ్రీరాములు, అధికారులు పాల్గొన్నారు.
మంచాల : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మూడు సంవత్సరాల కింద మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఎమ్మెల్యే తన వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 50వేల చొప్పున వారి కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి బహదూర్, సర్పంచ్ కిషన్, ఎంపీటీసీ పరంగి, నాయకులు గణేశ్, అనీల్ నాయక్, లాలూ , శంకర్, శ్రీశైలం, సుధాకర్ ఉన్నారు
ఇబ్రహీంపట్నం : తెలంగాణ రైతాంగం మేలు కోసం ఎంతదాకైనా పోరాడుదామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం టీఆర్ఎస్ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతన్నకు మద్దతుగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం కోసం బుధవారం నుంచి నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కార్యకర్తల సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు కల్లెం జంగారెడ్డి గార్డెన్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, పంటలను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ రైతుల నుంచి వడ్లు కొనాలని, లేకుంటే వారి ఆగ్రహానికి బీజేపీ పతనంగాక తప్పదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవంతి, చెవుల స్వప్న, వైస్ చైర్మన్లు ఆకుల యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు రమేశ్, కిషన్‌గౌడ్, భాస్కర్‌రెడ్డి, బహదూర్, పాశ్చ బాష, మున్సిపల్ అధ్యక్షుడుకృష్ణారెడ్డి, అమరేందర్‌రెడ్డి, జంగయ్య, సహకార సంఘం చైర్మన్లు రాజేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జోగిరెడ్డి, జంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులున్నారు.