కులకచర్ల, జనవరి 26 : పీఏసీఎస్‌లో రుణాలు పొంది సభ్యత్వం కలిగి ఉన్న రైతులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం తొమ్మిదివేల రూపా యలు పీఏసీఎస్ నుంచి చెల్లిస్తున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మ న్ బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో హన్మ్యనాయక్తండాకు చెందిన రైతు పీఏసీఎస్‌లో లక్ష్మణ్‌కు ఖాతా ఉండటంతో పాటు సభ్యత్వం ఉన్న కా రణంగా అయన అంత్యక్రియలకు తొమ్మిదివేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం వివిద సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తుం దన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు జమఅవుతాయన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, పీఏసీఎస్ సీఈవో బక్కారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాంలాల్, టీఆర్ ఎస్ నాయకులు రాజప్ప, మొగులయ్య, ఆంజనేయులు, దామోర్‌రెడ్డి, బొం బాయి రాములు, గుండుమల్ల నర్సింహులు, నరేశ్, సర్పంచ్ లక్ష్మయ్య, పీఏ సీఎస్ డైరెక్టర్ కొండయ్య, సీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ డైరీ ఆవిష్కరణ
కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామంలో టీఎస్‌యూటీఎఫ్ డైరీని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం జరిగేవిదంగా చూడాలని కోరుతూ టీఎస్‌యూటీఎప్ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు వెంకటరత్నం, బం దెప్ప, కార్యదర్శులు రాములు, పవన్‌కుమార్, కులకచర్ల మండల అధ్యక్ష కార్యదర్శులు రమేశ్, వి.రమేశ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.