కులకచర్ల, మార్చి 12 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్ అన్నారు. శనివారం బిందెంగడ్డతండా గ్రామపంచాయతీలో రూ.5లక్షలతో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించే సీసీ రోడ్డు పనులను సర్పంచ్ తుల్జానాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు, ఎమ్మెల్యే సోదరుడు కొప్పుల అనీల్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులను నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయిస్తున్నదని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలో శ్మశానవాటికల నిర్మాణం, డంపింగ్ యార్డు, మురుగునీటి డ్రైనేజీల నిర్మాణం జరుగుతున్నదన్నారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గ్రామాల్లో పరిపాలన సక్రమంగా కొనసాగేందుకు భారీగా నిధులను విడుదల చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో అంతారం ఎంపీటీసీ లలిత, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, టీఆర్ఎస్ చౌడాపూర్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, కృష్ణగౌడ్, మొగులయ్య, సాయన్న, ఆంజనేయులు, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.