నందిగామ, ఫిబ్రవరి 16 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని చాకలిగుట్టతండా, రంగాపూర్, సలివేంద్రిగూడ, అప్పారెడ్డిగూడ, ఈదులపల్లి, మొత్కులగూడ, మసీదుమామిడిపల్లి, మామిడిపల్లి, శ్రీనివాసులగూడ, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ గ్రామాల్లో అభివృద్ధి పనులకు జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంకగౌడ్, వైస్ ఎంపీపీ మంజుల, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజునాయక్, రమేశ్‌గౌడ్, నర్సింలు, స్వామి, చంద్రారెడ్డి, జెట్ట కుమార్, అశోక్, రజనీతగౌడ్, బండి నిళమ్మ, కవిత, ఎల్లమ్మ, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ లత, పీఏసీఎస్ చైర్మన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన ప్రశాంత్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 60 వేల చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి ద్వారా నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందనే విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్లు జీటీ శ్రీనివాస్, సర్వర్‌పాషా, రాజు, గ్రంథాలయ డైరెక్టర్ గోపాల్, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, నారాయణ, శివశంకర్, రాఘవేందర్, ఆనంద్ పాల్గొన్నారు.