కడ్తాల్, మార్చి 10 : రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, నిరుద్యోగులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ దశరథ్‌నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలోఅంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు వాణిశ్రీ, రైతుబంధు మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌లు తులసీరాంనాయక్, యాదయ్య, భారతమ్మ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, అనిల్‌యాదవ్, ఎల్లాగౌడ్, ముత్యాలు, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్‌అలీ, నర్సింహాగౌడ్, సేవ్యానాయక్ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేయడంతో నిరుద్యోగుల కల నెరవేరిందని తెలంగాణ జాగృతి తాలుకా కన్వీనర్ ముస్తఫా, విద్యార్థి విభాగం తాలుకా కన్వీనర్ బాలాజీ ఉదయ్ అన్నారు. గురువారం పట్టణంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. నిరుద్యోగుల కల సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో నాయకులు రవి, సంతోష్, రమేశ్, రాజు పాల్గొన్నారు.
తలకొండపల్లి : ఉద్యోగ నియామకాల ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో గురువారం టీఆర్ఎస్ నాయకులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింహ, ఆమనగల్లు మార్కెట్ డైరెక్టర్ శేఖర్, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మల్లేశ్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు సజ్జుపాషా, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు మధు, యాదయ్య, శ్రీరాం, చంద్రయ్య, రాజు, శ్రీను, స్వామి, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
కొందుర్గు : జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగ నియామక ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, యువజన విభాగం మండల అధ్యక్షుడు గణేశ్, నాయకులు సత్యం, స్వామి, మోత్యానాయక్, చంద్రయ్య, చంద్రశేఖర్, నరేశ్, సన్నీ, శివరాజ్ పాల్గొన్నారు.
మంచాల : సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ల ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలో టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. యువజన విభాగం అధ్యక్షడు వనపర్తి బద్రీనాథ్ పాల్గొన్నారు. జాపాల గ్రామంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో విజయ్, శేఖర్, ఎండీ జానీపాషా, ప్రశాంత్ కుమార్, ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్, సాయిగౌడ్, నాగరాజు, చంద్రకాంత్, మల్లప్ప, సోమేశ్వర్ పాల్గొన్నారు.
తుర్కయాంజాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా 91,142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన సందర్భంగా తుర్కయాంజాల్‌లో సీఎం చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీకి పూనుకున్నారన్నారు. విభజన సమస్యలు తేలకపోవడంతోనే ఇన్నాళ్లు ఉద్యోగాల భర్తీకి ఆటంకం కలిగిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ రామావత్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్లు పుల్లగుర్రం కీర్తన, జ్యోతి, వేముల స్వాతి, భాగ్యమ్మ, డైరెక్టర్ సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.