కొడంగల్, మార్చి 5 : దళితుల ఆర్థికంగా ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో దళితబంధు పథకంపై స్థాయి సంఘాల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూమోజెస్, డ్వామా పీడీ కృష్ణన్, సివిల్ సైప్లె అధికారి విమల, స్థాయి సంఘం సభ్యులు లబ్ధిదారులకు సహకరించాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదన్నారు. లబ్ధిదారులు తమకు అనుభవం, ఆసక్తి గల యూనిట్లను ఎంచుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ ఆవుటి నాగరాణి, పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, దళిత సంఘ స్థాయి సభ్యులు పాల్గొన్నారు.
ఈనెల 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు సంబురాలను నిర్వహించాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆడపిల్లల వివాహం చేసేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక భరోసాను కల్పించేలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. 8వ తేదీన మహిళలకు మంజూరైన రూ.7కోట్ల రుణాలను మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్ అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రమేశ్‌బాబు పాల్గొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందుతున్నాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అన్నారం గ్రామంలో రూ.10క్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.10లక్షలతో వైకుంఠధామం, రూ.10లక్షలతో పల్లె ప్రకృవనంతో పాటు ఎస్సీ కాలనీలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెయిన్‌రోడ్డుపై మురుగు కాలువల నిర్మాణం, మిగతా వాటికి త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. సమావేశంలో సర్పంచ్ అనితఫకీరప్ప, ఎంపీటీసీ రాములు, మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
బొంరాస్‌పేట, మార్చి 5 : సీఎం కేసీఆర్ కృషితోనే గిరిజనులకు తండాల్లో పాలానాధికారం సాధ్యమైందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ.1.10 కోట్లతో బురాన్‌పూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మల్లెవోనికుంటతండా, ఇక్కడి నుంచి బుగ్యానాయక్తండా వరకూ రూ.30 లక్షలు, బుగ్యానాయక్తండా నుంచి బురాన్‌పూర్ పీడబ్ల్యూడీ రోడ్డు వరకు రూ.1 కోటితో, మదన్‌పల్లి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గట్టెనాయక్తండా వరకు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయా తండాల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తండాలకు బీటీ రోడ్లు మంజూరు కావడంతో మహిళలు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్‌పాషా, సర్పంచ్ స్వాతి, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, శ్రవణ్‌గౌడ్, ఎల్లప్ప, కోఆప్షన్ సభ్యుడు ఖాజా మైనుద్దీన్, పార్టీ నాయకులు దేశ్యానాయక్, నరేశ్‌గౌడ్, రమణారెడ్డి, మహేందర్, రామకృష్ణ, బసిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.