అప్రమత్తతతోనే జీవాలకు రక్షణ
గొర్రెలు, మేకల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆదాయం దండిగా ఉంటుందని.. అప్రమత్తతతోనే జీవాలు సంరక్షణగా ఉంటాయని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప అన్నారు.
- గొర్రెల పునరుత్పత్తిలో సరైన జాగ్రత్తలు పాటించాలి
- రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప
ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 16 : గొర్రెలు, మేకల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆదాయం దండిగా ఉంటుందని.. అప్రమత్తతతోనే జీవాలు సంరక్షణగా ఉంటాయని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప అన్నారు. గొర్రెలు, మేకల్లో పునరుత్పత్తి పెం పొందేలా చర్యలు తీసుకుంటే మంద పెరిగి సంపద వృద్ధి చెందుతుందన్నారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులైన గొంతువాపు, గాలికుంటువ్యాధి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాలు దరిచేరవని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 7.60 లక్షల గొర్రెలున్నాయని వీటితో మందను మరింత వృద్ధి చేయొచ్చని.. గొర్రెల పునరుత్పత్తిలో తీసుకోవాల్సిన
జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..
- 90 శాతం గొర్రెలు జనవరి నుంచి మార్చి వరకు ఎదకొస్తాయి. రెండో దశ జూన్ నుంచి
ఆగస్టు వరకు ఉంటుంది. - మంచి జాతి పొటేళ్లను ఎంపిక చేసుకుని మందలో వదలాలి.
- పునరుత్పత్తి శక్తి తగ్గినా.. పండ్లులేని ముసలి గొర్రెలను మందలోంచి తీసేయాలి.
- ఏడాదికన్నా ఎక్కువ కాలం గర్భం దాల్చని జీవాలను మందలోంచి వేరుచేయాలి.
- గొర్రెలను సంతలో కొనొద్దు. మంచి మందలను పరిశీలించి ఎంపిక చేసుకోవాలి.
- పిల్లలు పుట్టిన వెంటనే ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలి. ముక్కు, నోటి మీద ఉన్న పొరను తొలగించాలి.
- గంటలో ముర్రుపాలు తాపించాలి.
- పిల్లల్లో మొదటి మూడు నెలలు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నట్టల నివారణ మందులను తాగించాలి. తర్వాత 15 రోజుల్లోపు చిటుకువ్యాధి నివారణ టీకాలు వేయించాలి.
గొర్రెలకు వచ్చే వ్యాధులు.. నివారణ చర్యలు..
గొర్రెలకు ముఖ్యంగా న్యూమోనియా, చిటుకువైరస్, గాలికుంటు, నీలినాలుక వ్యాధులు వస్తాయి. తొలకరి వర్షాలు మొదలైన తర్వాత వచ్చే వ్యాధుల్లో గాలికుంటు, నీలినాలుక ముఖ్యమైనవి. వీటి నివారణకు ఆక్రిటెట్రాసైక్లిన్ పది మిల్లీగ్రాములు, పొటాషియం పర్మాం గనేట్ 50 మిల్లీగ్రాములు, 100మిల్లీలీటర్ల నీటిలో కలిపి తాగించాలి. ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్న గొర్రెలకు జ్వరం, దగ్గు, ముక్కు నుంచి చీమిడి, నీరుకారడం, ఎగశ్వాస అధికంగా ఉంటుంది.
దాని నివారణకు జెంటామైసిన్ 4మిల్లీగ్రాములు లేదా సిప్రాప్లాక్సిన్ 5 మిల్లీ గ్రాములు ఇవ్వాలి. గాలికుంటు వ్యాధి సోకిన గొర్రెల్లో నాలుగు, ముక్కుపై కాలి గిట్టల మధ్య పొదుగుమీద బొబ్బలు ఏర్పడతాయి. తద్వారా గొర్రె మేత తీసుకోలేక నీరసించి పోతుంది. నివారణకు ప్రభుత్వం సరఫరా చేసే గాలికుంటు వ్యాధి టీకా, రక్ష ఎంఎఫ్ఎండీ టీకా 1 మిల్లీ లీటర్ ప్రతి ఆరునెలలకోసారి చర్మం కింద ఇవ్వాలి.
మందలో జీవాలను ఎప్పటికప్పుడు గమనించాలి
గొర్రెల పెంపకంలో యాజమానులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రోగాలు వాటిపై దాడి చేస్తాయి. మూత్ర నాలాల్లో రాళ్లజబ్బు, చూళ్లు గొర్రెల్లో విషపు జబ్బు, గొర్రెల్లో మెదడు మెత్తబడి వచ్చే పోలియో, సూక్ష్మజీవులు, వైరస్‌తో వచ్చే వ్యాధు లు, ఇలా గొర్రె ల ఆరోగ్యంపై దాడి చేస్తూనే ఉంటా యి. ఎప్పటి కప్పుడు ప్రభుత్వం సరఫరా చేసే టీకా లను వేయిం చాలి. గొర్రెల ఆరోగ్యం బాగా లేకుంటే పశువైద్యాధి కారులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులను వాడాలి.
-అంజిలప్ప ,రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

