నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ‘ఈద్ ఉల్ ఫితర్’ను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈద్గా, మసీద్‌ల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ముస్లిం మత పెద్దలు (ఖాజీలు) ఖురాన్ బోధనలను చదివి వినిపించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకొన్నారు.
– న్యూస్‌నెట్‌వర్క్, నమస్తేతెలంగాణ