కుత్బుల్లాపూర్, మార్చి16: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్య భవిష్యత్‌కు పెన్నిదిగా ఉంటుందని బీఆర్ఎస్ శాసనసభా పక్ష విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుభాష్ నగర్ ప్రాంత వాసి మైలరాం భార్గవి (30), గాజుల రామారం ప్రాంత వాసి షాజత్ బేగం (88).. తమ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎల్ఓసీ మంజూరు చేయించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేను అభ్యర్ధించారు. వారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే వివేకానంద చలించారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే వివేకానంద సంప్రదించి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మైలరాం భార్గవి భర్త మైలారం రమేష్‌కు రూ.1,25,000, షాజత్ బేగంకు రూ.2 లక్షలకు ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే వివేకానంద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానందా మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక భద్రతనిచ్చేది, ఆరోగ్య భరోసానిచ్చేది సీఎం సహాయనిధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీ నారాయణ, దుర్గా రావు తదితరులు పాల్గొన్నారు.