తుర్కయంజాల్, జూన్ 28: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 105వ జయంతి వేడుకలను శనివారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడలో ఇబ్రహీంపట్నం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పీవీ నరసింహరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్,అధ్యక్షుడు మోహన్రావు,నాయకులు సునీల్ శర్మ,బాలాంతర వీర్రాజు,రాఘవేంద్రరావు,వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.