షాద్‌నగర్, జనవరి 20 : అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి స్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. నియోజకవర్గంలోని చించోడు, నందిగామ, కొత్తూరు, బూర్గుల, కేశంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పది కంటి వెలు గు వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. గురు, శుక్రవారాల్లో ఆ కేంద్రాల్లో సుమా రు రెండువేల మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకోగా.. 1200 మందికి వైద్యులు మందులు, మరో 600పైగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.
శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎలికట్ట, కిషన్‌నగర్ గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని వైద్య సిబ్బం దికి సూచించారు. ఆపరేషన్ అవసరం ఉ న్న వారిని ప్రత్యేకంగా గుర్తించి తగిన చర్య లు తీసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డాక్టర్ జయలక్ష్మి, వైద్య సిబ్బంది శ్రీనివాస్, కంటి వైద్యులు, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.