Vikarabad | బొంరాస్పేట, జూన్ 25 : ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభమై నేటికీ 12 రోజులు గడిచి పోయాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని తపస్ జిల్లా ఉపాధ్యక్షులు బాకారం మల్లయ్య అన్నారు. ఇప్పటివరకు జూన్ నెల మధ్యాహ్న భోజనం బియ్యం ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యంను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనానికి అంతరాయం లేకుండా జూన్ నెల బియ్యం కోటా విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల శాఖ తపస్ అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్ పాల్గొన్నారు.