వికారాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మక నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన జిల్లా ప్రజాప్రతినిధులు, నేవీ రాడార్ ఏర్పాటుకు స్థానికుల అభిప్రాయంతోపాటు పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. రూ.1900 కోట్లతో పూడూర్ మండలం దామగుండంలోని రిజర్వు ఫారెస్ట్‌లో ఇండియన్ నేవీ రాడార్ వ్యవస్థను 2700 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిచింది. ఈ మేరకు శనివారం కలెక్టర్ నారాయణరెడ్డి ఆ ఫారెస్ట్‌ను సందర్శించి, అనంతరం స్థానికులతో చర్చించారు. నాలుగేండ్ల క్రితమే నేవీ రాడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకునేందుకు కేసీఆర్ సర్కార్ కృషి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోని భూములను రాష్ట్ర సర్కార్‌కు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో నేవీ రాడర్ ఏర్పాటు అంశాన్ని గత సర్కార్ పక్కన బెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం నేవీ రాడార్ ఏర్పాటుకుగాను సానుకూలంగా ఉండడంతో ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం ప్రక్రియను వేగవంతం చేసింది.
ప్రతిష్టాత్మక నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుపై మళ్లీ కదలిక వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల జిల్లా అధికారుల తో నిర్వహించిన సమావేశంలో చర్చించిన జిల్లా ప్రజాప్రతినిధులు, నేవీ రాడార్ ఏర్పాటుకు సం బంధించి స్థానికుల అభిప్రాయంతోపాటు పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో శుక్రవారం కలెక్టర్ నారాయణరెడ్డి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌ను సందర్శించి, అనంతరం స్థానికులతో చర్చించారు. జిల్లాలోని దామగుండంలో మెగా ప్రాజెక్టు అయిన నేవీ రాడార్ ఏర్పాటు చేయాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితోపాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా పట్టుబడుతున్నట్లు తెలిసింది. నాలుగేండ్ల క్రితమే నేవీ రాడార్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం పూర్తయ్యే దశకు ప్రక్రియ వెళ్లినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. దీంతో గత ప్రభు త్వం నేవీ రాడార్ అంశాన్ని పక్కన బెట్టింది. ప్ర స్తుత ప్రభుత్వం నేవీ రాడార్ ఏర్పాటుకు సానుకూలంగా ఉండడంతో ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం ప్రక్రియను వేగవంతం చేసింది. మరోవైపు దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నేవీ రాడార్ ఏర్పాటు చేయవద్దని స్థానికులు కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. నేవీ రాడార్ ఏర్పాటు వి షయంలో స్థానికుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేసేలా అడుగులు పడుతున్నాయి.
రూ.1,900 కోట్లతో భారీ ప్రాజెక్టు
కేంద్ర ప్రభుత్వం రూ.1,900 కోట్లతో పూడూర్ మండలం దామగుండంలోని రిజర్వు ఫారెస్ట్‌లో ఇండియన్ నేవీ రాడార్ వ్యవస్థను 2,700 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. 2011-12 సంవత్సరంలో ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభం కాగా 2014లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ అంచనాకు వచ్చాయి. అలాగే నేవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖకు నాలుగేండ్ల క్రితమే రూ.133 కోట్లు అందజేసింది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరం, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తై న ప్రాంతం కావడంతో దామగుండం రిజర్వు ఫారెస్ట్‌లోని భూములను నేవీ రాడార్ ఏర్పాటు కు గుర్తించారు. రిజర్వు ఫారెస్ట్‌కు సంబంధించిన భూముల్లో పురాతన రామలింగేశ్వర ఆలయం ఉండడంతో ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఏ ర్పడ్డాయి. పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, మరో ఆలయాన్ని పూడూర్ గ్రామ సమీపంలో నిర్మించేందుకు నేవీ అధికారులు అంగీకరించడంతో పాటు స్థానిక ప్రజలు సమ్మతించినప్పటికీ తదనంతరం నేవీ రాడార్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే. నేవీ ఒప్పందానికి సంబంధించి గ్రామ పంచాయతీ తీర్మానం కూడా అప్పట్లోనే పూర్తి చేశారు. అలాగే నేవీ రాడార్ ఏర్పాటుకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థానిక ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేసింది.
పలు శాఖల నుంచి గ్రీన్‌సిగ్నల్
దామగుండం రిజర్వు ఫారెస్ట్‌లో 29 ఎకరాల్లో విస్తరించి ఉన్న పురాతన రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా నేవీ ఆధీనంలోకి వెళ్లనున్నది. భద్రత పరిస్థితుల దృష్ట్యా భక్తుల సందర్శనార్థం దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని పొలిన మరో ఆలయాన్ని, కల్యాణ మండపాన్ని పూడూర్ గ్రామ సమీపంలో ఐదెకరాల్లో నిర్మించేందుకు నేవీ అధికారులు గతంలోనే ఒప్పకున్నా రు. నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో 100 ఎకరాల్లో అధికారులకు సంబంధించి క్వార్టర్స్, కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.1,900 కోట్లతో ఏర్పాటు చేయనున్న నేవీ రాడార్ కేంద్రానికి సంబంధించి ఇప్పటికే పర్యావరణం, కాలుష్యం, అటవీ శాఖ, దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో నేవీ రాడార్ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది.
దామగుండం అటవీ ప్రాంతమే అనుకూలం
దామగుండం రిజర్వు ఫారెస్ట్ సముద్ర మట్టానికి సరిగ్గా 360 అడుగుల ఎత్తులో ఉండడం తో నేవీ రాడార్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు ఈ ప్రాంతాన్ని ఎం పిక చేశారు. ఎత్తైన ప్రదేశం కావడంతో సము ద్ర మార్గాన్ని క్షుణ్ణంగా వీక్షించేందుకు సులువుగా ఉండనున్నది. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి రహస్యంగా వచ్చే చొరబాటుదారులను రాడార్ వ్యవస్థ ద్వారా పసిగట్టనున్నారు. దా మగుండం అటవీ ప్రాంతం పూర్తి అనుకూలంగా ఉండడంతో అధికారులు ఈ భూముల ను ఎంపిక చేశారు. వెనుకబడిన జిల్లా ఆయిన వికారాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నేవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ వ్యవస్థ ఏర్పాటుతో సమీపంలోని గ్రామాల దశ-దిశ పూర్తిగా మారనున్నది. నేవీకి చెందిన అధికారుల నివాసం నిమిత్తం 100 ఎ కరాల్లో క్వార్టర్స్‌తోపాటు వారి పిల్లల చదువు నిమిత్తం కేంద్రీయ విద్యాలయాన్ని సైతం ని ర్మించనున్నారు. సమీప గ్రామాల ప్రజలకు ఉపాధి లభించడంతోపాటు సంబంధిత గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి. నేవీ రాడార్ కేంద్రానికి వెళ్లాలంటే పూడూర్ మండల కేంద్రం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో సంబంధిత గ్రామంలో రోడ్లతోపాటు ఇతర అభివృద్ధి జరుగనున్నది. నిత్యావసర వస్తువులు, సరుకులు అవసరం.. అలాగే కూరగాయలను పండించే రైతులు సైతం పట్టణ ప్రాంతానికి వెళ్లి విక్రయించాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే విక్రయించి లా భాలను అర్జించే పరిస్థితి త్వరలో స్థానిక రైతులకు రానున్నది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తాం
దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నేవీ రాడార్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తాం. సీసీఎల్ఏ నుంచి అడిగిన సమాచార నిమిత్తం దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని సందర్శించాం. నేవీ రాడార్ ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతాం.
– నారాయణ రెడ్డి, కలెక్టర్, వికారాబాద్ జిల్లా