Drianage Issue | కొండాపూర్, నవంబర్ 12 : నెలల నుంచి ఆ ఇండ్ల ముందు నుంచి వరద పారుతుంది. వర్షం పడలేదు… వరదలు అసలే లేవు.. కానీ ఇండ్ల ముందు నుంచి వరద పారుతుంది. ఇంతకీ ఎక్కడిది ఆ వరద అనుకుంటున్నారా..? ఆ వరద ఏంటని చూడగా.. అది కాస్త డ్రైనేజీ మురుగు. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు… నెలల నుంచి ఇలా మురుగు పారుతుంది.
మురుగు నీటితో ప్రేమ్ నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్లో మురుగు నీరు రోడ్లపై పారడం నిత్యకృత్యంగా మారిందని, మా పరిస్థితితిని పట్టించుకునే వారు కరువయ్యారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు చూపే ప్రేమలో పదో వంతు చూపినా మా సమస్యలు తీరిపోతాయంటూ కోరుతున్నారు. గత నెల రోజులుగా అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు.

Read Also :
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం